స్విస్ మిలిటరీ కొత్త ప్రొడక్టులు వచ్చేశాయ్

స్విస్ మిలిటరీ కొత్త ప్రొడక్టులు వచ్చేశాయ్

హైదరాబాద్, వెలుగు:  లైఫ్​స్టైల్​ బ్రాండ్ స్విస్ మిలిటరీ దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలు విస్తరించడంలో భాగంగా ట్రావెల్ ​బ్యాగేజీ ప్రొడక్టులను లాంచ్​ చేసింది. ప్రీమియం లగేజ్ , ట్రావెల్ గేర్‌‌ల కోసం డిమాండ్​ పెరిగిందని తెలిపింది. అల్యూమినియం ట్రాలీ వంటి తొమ్మిది ట్రావెల్​ ప్రొడక్టులను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. 

  స్విస్ మిలిటరీ మేనేజింగ్  అనూజ్ సాహ్నీ మాట్లాడుతూ విస్తరణలో భాగంగా కొత్త ప్రొడక్టులను లాంచ్​ చేశామని చెప్పారు. దక్షిణ భారతదేశంలో స్విస్ మిలిటరీ విస్తరణలో అచలా కమర్షియల్ వెంచర్స్ వంటి రిటైలర్లతో కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు.  హైదరాబాద్, చెన్నై  త్రివేండ్రం ప్రస్తుతం తమ కార్యకలాపాలు ఉన్నాయని, దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో తమ పరిధిని విస్తరిస్తామని సాహ్ని అన్నారు.