జంతువులకూ ఎమోషన్స్ ఉంటయ్ : గొల్లనపల్లి ప్రసాద్

జంతువులకూ ఎమోషన్స్ ఉంటయ్ : గొల్లనపల్లి ప్రసాద్
  • 7న యానిమల్​ రైట్స్​ మార్చ్​
  • గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్ గొల్లనపల్లి ప్రసాద్

బషీర్​బాగ్, వెలుగు: మనుషులవలే జంతువులకూ భావోద్వేగాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన అవసరముందని గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్, గాంధీయన్ సొసైటీ న్యూజెర్సీ, యూఎస్ఏ సెక్రటరీ ప్రొఫెసర్​ గొల్లనపల్లి ప్రసాద్ అన్నారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పీటర్ మ్యారీస్ బర్గ్ దక్షిణాఫ్రికా బన్నీ బులా, వీవోటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సూరజ్ సీతారామతో కలిసి ఆయన మాట్లాడారు. 

వీగస్ ఇండియా మూవ్​మెంట్, వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్పీసీసీజంకు వ్యతిరేకంగా ఈ నెల 7న సాయంత్రం 3 గంటలకు యానిమల్​ రైట్స్ మార్చ్- 2025ను శిల్పారామం నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా సినిమా దర్శకుడు శశికిరణ్ టిక్క, దీపిక హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మనిషి స్వార్థం కోసం జంతువులను పెంచి వాటి స్వేచ్ఛను హరిస్తున్నాడని, అవి కూడా నొప్పి, సంతోషం, బాధను వ్యక్తం చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వీవోటీ సభ్యులు ప్రణయ్ ఉపాధ్యాయ, విశాల్ వంశీ, సిన్సమ్ ఫౌండేషన్ ఫౌండర్ ఇషాంత్ దూబే పాల్గొన్నారు.