ఇమ్యూనిటీ కోసం డైలీ ఫుడ్​ మెనూ ఇలా..

ఇమ్యూనిటీ కోసం డైలీ ఫుడ్​ మెనూ ఇలా..

ఇమ్యూనిటీ ఇట్లొస్తది..
మనిషి పుట్టిననాటి నుంచి జీవితాంతం తోడుండేది ‘ఇమ్యూనిటీ’. దీన్ని కాపాడుకోవాలి. అవసరం వచ్చినప్పుడు పెంచుకోవాలి. ఇప్పుడు దాని అవసరం వచ్చింది. అందరూ పరుగులు తీసేది ఇమ్యూనిటీ కోసమే. హెల్దీ  లైఫ్‌‌  స్టయిల్​ను అలవాటు చేసుకోవడమే ఇమ్యూనిటీ మంత్రం. మంచి అలవాట్లు,  బ్యాలెన్స్​డ్​ డైట్​ , వ్యాయామం తప్పనిసరి. ఉరుకుల పరుగులతో వచ్చిపడే మానసిక ఒత్తిడి  ముప్పు కలిగిస్తుందని అంటున్నారు డాక్టర్లు.  మారుతున్న పరిస్థితులు, లైఫ్​ స్టయిల్​లో మార్పులు , కొత్త అలవాట్లకు మొగ్గు చూపడం వంటివి ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ  అందరూ  శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకుంటేనే రోగాల నుంచి బయటపడొచ్చు.  ఈ పరిస్థితుల్లో  ఆసుపత్రి అవసరం రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం.  అలాంటి ఆరోగ్యకరమైన ముందు జాగ్రత్తలనే  డాక్టర్లు  చెబుతున్నారు. 

డైట్‌‌తో పాటు ఎక్సర్​సైజ్​ 
మనిషికి ఫుడ్​ ఎంత ముఖ్యమో, ఎక్సర్​సైజ్​ కూడా అంతే ముఖ్యం. ఏ వృత్తిలో ఉన్నా ఎక్సర్​సైజ్​ చేస్తే హెల్దీగా ఉండొచ్చు.  రోజుకు మూడు పూటలా ఫుడ్ తీసుకున్నట్టే  మార్నింగ్​ లేదా ఈవెనింగ్​​  టైంలో ఎక్సర్​సైజ్ చేయాలి.  ఈ కరోనా తీవ్రంగా ఉన్న టైంలో ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల  హెల్దీగా ఉంటారు కూడా.

లోకల్​ సూపర్​ ఫుడ్స్​..!
ఇమ్యూనిటీ ఫుడ్​ అనంగనే అది కాస్ట్లీగా ఉండేదే  కానవసరం లేదు.  నట్స్​, అవిసె గింజలు, మునగాకు, బెర్రీస్​, దానిమ్మ, నేరేడు, ఉసిరి, పసుపు, చిరుధాన్యాలు, వెల్లుల్లి వంటి లోకల్​ ఫుడ్స్ కూడా  సూపర్​ ఫుడ్సే. వాటిలో మొత్తం  యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ఇస్తాయి.  వాటితో పాటు రెసిస్టెన్స్​ పవర్ కూడా పెరుగుతుంది.  
డైలీ ఫుడ్​ మెనూ ఇలా

  • రోజుకు మూడు సార్లు ​ మంచి ఫుడ్​ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చు. జంక్​ ఫుడ్​ను పూర్తిగా మానేయాలి. 
  • తినే తిండిలో విటమిన్‌‌– సి,  జింక్‌‌ ఉండాలి. 
  • నీటిలో నానబెట్టిన నట్స్‌‌, సీడ్స్‌‌ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు కూడా  ఉంటాయి.
  • రోజూ గుడ్డు తినడం తప్పనిసరి.
  • కరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తినాలి.
  • రాగి జావ లేదా ఓట్స్‌‌, విటమిన్‌‌- బి, పిండి పదార్థాలు ఉండేవి తినాలి. 
  • నీళ్లు ఎక్కువగా తాగాలి. హైడ్రేషన్‌‌ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకునేలా చేస్తుంది.
  • బటర్‌‌ మిల్క్‌‌, ఓఆర్‌‌ఎస్‌‌, కొబ్బరి నీరు, హెర్బల్‌‌ టీలు ఆరోగ్యానికి మంచివి. 
  • ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఫుడ్​ తింటే మంచిది. 
  • పండ్లు, కూరగాయలు  డైట్‌‌లో తప్పకుండా ఉండాలి.
  • పాలకూర, టమాట, బీట్‌‌రూట్‌‌ ఎక్కువగా తీసుకోవాలి.
  • షుగర్​, గుండె సంబంధిత హెల్త్​ ప్రాబ్లముంటే మాత్రం డాక్టర్ల సూచనల ప్రకారం డైట్​ తీసుకోవాలి. 
  • ఎక్సర్​సైజ్​ వీలైతే తరచూ యోగాసనాలు చేయాలి.

ఫుడ్​తోనే ఇమ్యూనిటీ..!
మంచి ఫుడ్​తోనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందరినీ ఎంతగానో భయపెడుతున్న కరోనా వైరస్‌‌ బారిన పడకుండా ఉండాలన్నా, ఒక వేళ సోకినా మనం తీసుకునే ఫుడ్​ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఫుడ్​ను తినాలి. పండ్లు, నట్స్‌‌, అన్నం, చపాతి, గుడ్లు ఇలా ఏది తినగలిగితే అది రోజు వారి మెనూలో ఉండాలి. ముఖ్యంగా వేడిగా ఉండాలి. ప్రస్తుతం, సీజన్‌‌ కూడా మారుతోంది. దానికి అనుగుణంగా ఆహారం మార్చుకోవాలి.