
అప్పుడే భోజనం పూర్తైంది. పొట్ట బరువెక్కింది. అంతలో చల్లగాలులు అలా అలా తాకాయి. జూలు విదుల్చుతూ ఓ పేద్ద ఆవలింత. నిద్ర అంతా తన కళ్లలోనే ఉన్నట్లు! చుట్టూ చూసిందా సింహరాజం. కూతవేటు దూరంలో పెద్ద ఎత్తు లేని ఓ చెట్టు. దాని కింద ఎక్కడానికి వీలుగా రాళ్లు. ఒక్క ఉదుటున దూకింది. రెండుగా చీలిన ఓ కొమ్మను చూసుకుంది. అలా భారంగా ఉన్న పొట్టను కిందకు జారవిడిచింది. క్షణాల్లోనే గాఢమైన నిద్రలోకి జారుకుంది. అచ్చం పసిబిడ్డలా నిద్దరోతున్న ఆ సింహాన్ని ఆఫ్రికాలోని ఉగండా నేషనల్ పార్కులో ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. మరో రెండు ఆడ సింహాలు కూడా వేట తర్వాత చెట్టెక్కాయి కానీ అవి నిద్రపోలేదు. జస్ట్ సేదతీరాయంతే!