అయోధ్యలో మటన్​ ..లిక్కర్​ బంద్​

అయోధ్యలో మటన్​ ..లిక్కర్​ బంద్​
  • మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం
  • రామ్ మందిర్ ప్రాముఖ్యత దృష్ట్యా నిర్ణయం 

అయోధ్య రామజన్మభూమి అయోధ్యలో మద్యం దుకాణాలు, మటన్ షాపులపై నిషేదం విధించారు. ఈ మేరకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసింది. ఆప్రాంతానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్ పథ్ గుండా అయోధ్య వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. సదస్గంజ్ నుంచి లతా మంగేశ్కర్ చౌక్ వరకు మొత్తం 13 కిలోమీటర్ల మేర విస్తరించిన రామ్ పధ్ను ఏడాది క్రితం అభివృద్ధి చేశారు. తాజా నిర్ణయంతో ఆ ప్రాంతంలోని 9 మటన్, 13 లిక్కర్ షాపులపై ప్రభావం పడనుంది.

Also Read : తెలంగాణ పర్యాటకులకు శుభవార్త

అయోధ్య రామాలయం దగ్గరలో ఉన్న  మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు  అక్కడి నుంచి వేరే ప్రదేశానికి మార్చుకోవాలని... ఆలయ పవిత్రను కాపాడాలని  అయోధ్య మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.  అయితే ఈ ఏరియాలోని  ప్రసిద్ద హోటళ్లలో ఎక్కువుగా మాంసాహారమే విక్రయిస్తారు.. ఈ హోటళ్లకు 50 ఏళ్ల వరకు లైసెన్సులు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు తీసుకున్న నిర్ణయంతో నిషేధం అమలు చేసేలోపు తమకు వేరే ప్రాంతంలో అవకాశం కల్పించాలని వ్యాపారస్థులు కోరుతున్నారు.