లిక్కర్ కేస్ అప్ డేట్.. అమిత్ బెయిల్ పిటిషన్ విచారణ  వాయిదా

లిక్కర్ కేస్ అప్ డేట్.. అమిత్ బెయిల్ పిటిషన్ విచారణ  వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు అమిత్ అరోరా  బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటే అమిత్ అరోరా  తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.  తనకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. అనేక ఆరోగ్య సమస్యలున్నాయని అరోరా న్యాయవాది కోర్టుకు తెలిపారు.  అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని జైల్ సూపరింటెండ్ ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.