ఈ వస్తువులు వెరీ కాస్ట్లీ గురూ...ఒక్క గ్రాము ధర ఎంతంటే...

 ఈ వస్తువులు వెరీ కాస్ట్లీ గురూ...ఒక్క గ్రాము ధర ఎంతంటే...

 భూమిపై చాలా మూలకాలున్నాయి. .  చాలావరకు మార్కెట్లో కొనాల్సిందే.  అత్యంత ఖరీదూన మూలకం బంగారం అని భావిస్తారు.   వాస్తవానికి బంగారం కంటే  ఖరీదైన మూలకాలు చాలానే ఉన్నాయి. కొన్నింటిని ప్రయోగశాలల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తయారుచేస్తారు. అది కూడా తక్కువ మొత్తంలో. అందుకే అత్యంత ఖరీదైనవి. మరి ఆ మూలకాలేంటో చూద్దాం.

ఫ్రాన్సియం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఫ్రాన్సియం. దీని ధర గ్రాముకు రూ.8.313 కోట్లు. ఇది రేడియోధార్మిక పదార్థం. దీని జీవితం కేవలం 22 నిమిషాలు. ఇది 22 నిమిషాల్లో మరొక పదార్థంగా మారుతుంది. దీని వల్ల ఎలాంటి ఆచరణాత్మక ఉపయోగం లేదు. అయినప్పటికీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన మూలకం.

లుటీషియం

భూమిపై ఉన్న అరుదైన లోహాల్లో లుటీషియం కూడా ఒకటి. వాణిజ్యపరమైన ఉపయోగం చాలా తక్కువ. కానీ స్థిరమైన లుటీషియం పెట్రోలియం రిఫైనరీలలో ఉపయోగిస్తారు. ఆల్కైలేషన్, హైడ్రోజనేషన్, పాలిమరైజేషన్ వంటి ప్రక్రియలలో కూడా ఉపయోగిస్తారు. ఒక గ్రాము లూటియం ధర సుమారు  57వేల రూపాయలు.  

 కాలిఫోర్నియా

అత్యంత ఖరీదైన మూలకాల  జాబితాలో కాలిఫోర్నియా  కూడాఉంది. ఈ  రేడియోధార్మిక మూలకాన్ని  మొట్టమొదట 1950లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో దీనిని సృష్టించారు. అప్పటి నుండి దీన్ని గ్రాముల పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి చేశారు. దీని ధర గ్రాముకు రూ. 2.25 కోట్లు. ప్రపంచంలో ఏటా అర గ్రాము మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 

స్కాండియం

ప్రపంచంలో చాలా తక్కువ పరిమాణంలో లభించే స్కాండియం కూడా ఖరీదైన మూలకం. అల్యూమినియం మిశ్రమాలపై దీని ప్రభావం మొదట 1970ల్లో కనిపించింది. ఈ కారణంగా నేటికీ దీనిని ఉపయోగిస్తున్నారు. దీని ధర సుమారు గ్రాముుకు 22 వేల రూపాయలు. 

ప్లూటోనియం

ప్లూటోనియంను అణుబాంబు లేదా అణు కర్మాగారాల్లో ఉపయోగిస్తారు. ప్లూటోనియం 239, 241 రూపాలు.. రెండూ రేడియోధార్మికమైనవి. దీనిని నిల్వచేయడం, పేలుడు నుండి రక్షించడం అంత ఈజీ కాదు. ఒక్క గ్రాము ధర సుమారు రూ.33 లక్షలు. 

రోడియం

రోడియంను రైళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎలాంటి కెమికల్స్‌తోనూ తుప్పు పట్టకపోవడం దీని ప్రత్యేకత. ఆభరణాలలో కూడా ఉపయోగిస్తారు. రోడియం సన్నని పొరను బంగారంపై పూస్తారు. ఆభరణాలకు మంచి షైనింగ్ ఇస్తుంది. దీని ధర గ్రాముకు రూ.48 వేలు. 

కార్బన్ 

 కార్బన్  మూలకం కూడా చాలా కాస్ట్లీ.  భూమ్మీద ఉన్న అన్ని జీవరాశుల్లోనూ ఇది ఉంది. ఐతే గ్రాఫైట్ రూపానికి రేటు ఎక్కువ. కార్బన్ పరమాణువులను ప్రత్యేక పద్ధతిలో నిక్షిప్తం చేస్తే.. అది చాలా ఖరీదైనదిగా మారుతుంది. వజ్రం రూపంలో కార్భన్ ధర గ్రాముకు రూ .54 లక్షలకు పైగా ఉంటుంది.