మిస్డ్ కాల్‌‌ ఇస్తే లోన్ ఇస్తరట

మిస్డ్ కాల్‌‌ ఇస్తే లోన్ ఇస్తరట
  • ఎస్​ఎంఎస్​ పంపినా ​స్టేట్​బ్యాంక్​ ఎక్స్‌‌ప్రెస్‌‌ క్రెడిట్‌‌ పర్సనల్‌‌ లోన్‌‌

న్యూఢిల్లీ: అర్హులైన తన కస్టమర్లకు స్టేట్​బ్యాంక్​ కేవలం ఐదు సెకన్లలో ఇన్‌‌స్టంట్‌‌గా లోన్‌‌ ఇవ్వనుంది. ఈ ఫెసిలిటీ కావాలనుకున్న వారు ‘PERSONAL’ అని టైప్ చేసి 7208933145 కి ఎస్‌‌ఎంఎస్ పెట్టాలి. లేదా 7208933142 కి మిస్డ్ కాల్‌‌ ఇవ్వాలి.  లోన్​కు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే కన్ఫర్మేషన్​ ఇస్తారు. శాలరీ అకౌంట్‌‌ ఎస్‌‌బీఐలో ఉండి, నెలకు జీతం కనీసం రూ. 15 వేలుంటే ఎక్స్‌‌ప్రెస్‌‌ పర్సనల్ లోన్‌‌కు అప్లయ్‌‌ చేసుకోవచ్చు. ఈ లోన్‌‌పై 9.6 శాతం వడ్డీని బ్యాంక్ వసూలు చేస్తుంది. ‘వెడ్డింగ్‌‌ లేదా వెకేషన్‌‌, ప్లాన్ చేసుకున్న ఖర్చులైనా లేదా ఊహించని ఎమర్జెన్సీ అయినా ఎక్స్‌‌ప్రెస్‌‌ క్రెడిట్‌‌ ద్వారా కస్టమర్ల లోన్స్‌‌ తొందరగా అప్రూవ్‌‌ అవుతాయి.  డాక్యుమెంటేషన్‌‌ తక్కువగా ఉంటుంది. అప్రూవ్డ్‌‌ లోన్‌‌  ఇన్‌‌స్టంట్‌‌గా డిస్‌‌బర్స్‌‌ అవుతుంది’ అని  స్టేట్‌‌ బ్యాంక్ తన వెబ్‌‌సైట్‌‌లో పేర్కొంది.

ఛార్జీలు..

ఈఎంఐ టైమ్‌‌కు కట్టకపోతే బకాయిలో 2 శాతాన్ని వసూలు చేస్తారు. ఇది వడ్డీ రేటుకు అదనం. లోన్‌‌ అమౌంట్‌‌ టెనూర్‌‌‌‌కు ముందే చెల్లించాలనుకుంటే ప్రీపెయిడ్ అమౌంట్‌‌లో 3 శాతాన్ని కట్ చేస్తారు. ఇదే స్కీమ్‌‌ కింద కొత్త లోన్‌‌ తీసుకుంటే ఎటువంటి ప్రీ పేమెంట్ చార్జీలు  ఉండవు. లోన్‌‌ను కనీసం ఆరు నెలల్లో, గరిష్టంగా ఆరేళ్లు లేదా ఎంప్లాయ్‌‌కి మిగిలిన సర్వీస్‌‌(ఏది తక్కువైతే అదే) లో తీర్చొచ్చు.

ఎవరు అర్హులు?

శాలరీ అకౌంట్‌‌ ఎస్‌‌బీఐలో ఉన్నవారు. నెల జీతం కనీసం రూ. 15,000 ఉండాలి. ఈఎంఐ/ఎన్‌‌ఎంఐ(నెట్‌‌ మంత్లీ ఇన్‌‌కమ్‌‌) రేషియో 50 శాతం కంటే తక్కువుండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయి ఉండాలి.  పేరున్న ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌, కొన్ని కార్పొరేట్ సంస్థలలో ఎంప్లాయ్ అయినా లోన్ వస్తుంది.  కనిష్టంగా రూ. 25 వేలను, గరిష్టంగా రూ. 20 లక్షలను లేదా నెల జీతానికి 24 రెట్ల అమౌంట్‌‌ను లోన్‌‌గా ఇస్తారు. ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్ లోన్‌‌ కింద కనీసం రూ. 5 లక్షలు, గరిష్టంగా 20 లక్షలు లేదా  నెల జీతానికి 24 రెట్ల అమౌంట్‌‌ను ఇస్తారు. ఫస్ట్‌‌ లోన్‌‌ ఈఎంఐలను రెగ్యులర్‌‌‌‌గా చెల్లిస్తే, సెకెండ్‌‌ లోన్‌‌ను కూడా తీసుకోవచ్చు.

For More News..

రియల్టీలో మంచి ఆఫర్లు.. ఇల్లు కొనేద్దాం ఇప్పుడే!

ఐపీఎల్‌లో పేరు మార్చుకున్న పంజాబ్ జట్టు

జీఎస్‌టీ కిందకు నేచురల్‌ గ్యాస్‌.. ధరలు తగ్గే ఛాన్స్