కొత్తగూడెం పట్టణంలో పెట్రోల్ బంక్ పై కేసు నమోదు

కొత్తగూడెం పట్టణంలో పెట్రోల్ బంక్ పై కేసు నమోదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణం పోస్టాఫీస్​సెంటర్​లోని శ్రీనివాస ఫిల్లింగ్​ స్టేషన్​పై కేసు నమోదైంది. రెండు లీటర్ల పెట్రోల్​ పోయిస్తే అర లీటర్​ తక్కువ వచ్చిందని బాధితుడు జైలుద్దీన్​ బంక్​ యాజమాన్యం దృష్టికి తెచ్చాడు. కాగా తాము పెట్రోల్​ సరిగానే పోశామని బంక్​ సిబ్బంది తనపై దుర్భాషలాడారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై బాధితుడు పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్ ​చేశాడు.

 తక్కువ పెట్రోల్​ వచ్చిన విషయమై పెట్రోల్​ బంక్​ను తనిఖీ చేశానని తూనికలు, కొలతల శాఖాధికారి మనోహర్​ పేర్కొన్నారు. కొలతల్లో తేడా లేదని, జీరో చేయకుండా గుమాస్తా తన చేతి వాటం ప్రదర్శించడంతోనే పెట్రోల్​ తక్కువగా వచ్చిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.