బజార్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైన వంద రూపాయల నోటు లేదా 500 నోటు.. పెద్ద నోట్లే కాదు..10 రూపాయల నోటు కనిపించినా తీసుకోకుండా ఉండరు.. డబ్బుకు ఉన్న వ్యాల్యూ అలాంటిది.. కానీ వెనుజులాలో చూడండి.. డబ్బును బజార్ లో ఎలా ఎదజల్లుతున్నారో.. ట్రాక్టర్లలో పెద్ద పెద్ద పెట్టెలలో తెచ్చి మరీ విలువైన నోట్లను చిత్తు కాగితాల్లా పారబోస్తున్నారు. ఏమైంది వెనుజులా ప్రజలకు..?
వెనిజులాలో స్థానికులు డబ్బును గాల్లోకి విసిరేస్తున్నట్లు చూపిస్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వీడియోలో ట్రక్కుల్లో భారీ ఎత్తున నోట్లను తీసుకొచ్చి ఓ వ్యక్తి నడి వీధుల్లో పారబోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేనా.. పెద్ద ఎత్తున జనం గుమికూడి నినాదాలు చేస్తున్నారు.. వెనుజులాలో ఏం జరిగింది..?
వెనుజులాలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజలను ఆందోళన బాట పట్టించింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి కరెన్సీ ఎంత దిగజారిందో చెప్పేందుకు ప్రజలు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నోట్లు చిత్తు కాగితాల్లా రోడ్లపై ఎగుతున్నాయి.
చాలా ఏళ్లుగా వెనుజులా అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది. దీంతో పెద్ద మొత్తంలో నగదు కూడా విలువ లేనిదిగా మారింది. ఆహారం, మందులు, ఆయిల్ వంటి కనీస అవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎదైనా కొనాలంటూ అక్కడి ప్రజలను యూఎస్ డాలర్ల వంటి విదేశీ కరెన్సీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల కాలంలో వెనుజులా ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగింది. అంతకంతకు అక్కడి కరెన్సీ విలువ తగ్గుతూనే ఉంది. భారతీయ రూపాయి విలువ 1381 వెనుజులా బోలివర్లకు సమానం అంటే.. అక్కడి ద్రవ్యోల్బణం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెనిజులా ఆర్థిక పతనానికి అక్కడి రాజకీయ అనిశ్చితే కారణమని తెలుస్తోంది. అవినీతి,ఆర్థిక దుర్వినియోగం ద్రవ్యోల్బణం పెరిగేందుకు ఆజ్యం పోశాయంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం రేట్లు లక్షల శాతం మించిపోయిందంటే దానర్థం అక్కడి పరిస్థితులు ఎంతకు దిగజారాయో అద్దం పడుతుంది. ఒకప్పుడు విలువైన కరెన్సీ కేవలం కాగితంలా మారిన దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడాన్ని గుర్తుచేస్తోంది ఈ వైరల్ వీడియో.
वेनेजुएला में पैसे का मूल्य बहुत कम हो गया है। इससे आप कोई बड़ी चीज़ नहीं खरीद सकते।
— Dr. Sheetal yadav (@Sheetal2242) October 31, 2025
वेनेजुएला में मुद्रास्फीति बहुत अधिक है,
जिसका मतलब है कि पैसे की कीमत समय के साथ घटती जाती है।
भारत का 1 रू वेनेजुएला के 1,381 बोलिवर के बराबर है। pic.twitter.com/YJGl9OOapl
