అధికారంలోకి వస్తే మహిళా ముఖ్యమంత్రిని చేస్తం : లోక్ తంత్రిక్​ జనతాదళ్ పార్టీ

అధికారంలోకి వస్తే మహిళా ముఖ్యమంత్రిని చేస్తం  :  లోక్ తంత్రిక్​ జనతాదళ్ పార్టీ

ఖైరతాబాద్, వెలుగు: ఎన్నికల్లో లోక్​ తంత్రిక్​జనతా దళ్​ పార్టీ పోటీ చేస్తుందని  తెలంగాణ శాఖ అధ్యక్షుడు రత్నం బూరగ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో పోటీలో ఉంటారని ప్రకటించారు.  

తాము అధికారంలోకి వస్తే తొలి ఏడాది మహిళను సీఎంను చేస్తామని, రెండో ఏడాది బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్నారు.  కూకట్​పల్లి నుంచి భక్తవత్సలం, కోరుట్ల నుంచి ఎ.పాండురంగ పోటీ చేస్తారని, వారికి బీఫాంలు ఇచ్చినట్టు తెలిపారు.