
- లోకాయుక్త చైర్మన్ రాజశేఖర్ రెడ్డి
హాలియా, వెలుగు : నిడమనూర్ మండల కేంద్రంలోని సివిల్ కోర్టు నూతన భవనాన్ని రాష్ర్ట లోకాయుక్త చైర్మన్, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి యడవల్లి రాజశేఖర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఎమ్మెల్సీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డికి ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఆయన వెంట జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న, పీపీ సాధన, ఏజీపీ ఉన్నం చిన్న వీరయ్య, అడ్వకేట్స్మువ్వ అరుణ్ కుమార్, పల్ రెడ్డి రమణారెడ్డి, రఘురామారావు, పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, బొల్లం శ్రీనివాస్ యాదవ్, మెగారెడ్డి, భగవాన్ నాయక్, కత్తి స్వర్ణలత, ఆంగోతు లలిత, కత్తి వాణి, మాయకోటి వినోద్, బైరం రవి, చెన్ను సుందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.