Inimel Music Video: కమల్ హాసన్ నిర్మాణంలో..హీరోగా లోకేష్ కనగరాజ్,హీరోయిన్గా శ్రుతి హాసన్

Inimel Music Video: కమల్ హాసన్ నిర్మాణంలో..హీరోగా లోకేష్ కనగరాజ్,హీరోయిన్గా శ్రుతి హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోను తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ థోమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ (Inimel Music Video)ని నిర్మిస్తున్నారు. 

అయితే ఇక్కడ అదిరిపోయే స్పెషాలిటీ ఏంటంటే..ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) హీరోగా, శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోతో యాక్టర్గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నట్లు సమాచారం. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

అంతేకాదు..ఈ మ్యూజిక్ వీడియోకి శ్రుతి హాసన్ మ్యూజిక్ తో పాటు కాన్సెప్ట్ సైతం అందించారట. ఇనిమెల్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్ గా పనిచేశాడు.ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో రాబోతుంది. మరి ఇన్ని రకాల వెరైటీస్ తో రాబోతున్న ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. త్వరలోనే ఈ మ్యూజక్ వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. 

ALSO READ :- IPL 2024: ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన గుజరాత్ ప్లేయర్

కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మ్యూజిక్ వీడియోని తీసుకొస్తున్నారంటే..ఏదో స్పెషల్ ఉండేఉంటుందని తెలుగు తమిళ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఎలా ఉంటుందో చూడాలి.