మన రిజల్ట్స్ పై పాకిస్థాన్ ఇంట్రెస్ట్

మన రిజల్ట్స్ పై  పాకిస్థాన్ ఇంట్రెస్ట్

ఉదయం నుంచి ట్రెండ్స్
ఫాలో అయిన మీడియా

పత్రికలు, టీవీల్లో ప్రత్యేక కథనాలు

ఇస్లామాబాద్: ఇండియా ఎలక్షన్స్ రిజల్ట్స్ పాకిస్థాన్ మీడియాలో హెడ్ లైన్స్ అయ్యాయి. ఉదయం ట్రెండ్స్ తో మొదలుపెట్టి, రాత్రి వరకూ విస్తృత కవరేజ్ ఇచ్చింది. ఇండియా–పాకిస్థాన్ మధ్య సంబంధాలు కొత్త సర్కారుపై ఆధారపడి ఉండటమే ఇందు కు కారణం. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ సంబంధాలు దిగజారిపోయాయి. పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ ఓట్ల కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే లీడ్ లో ఉందంటూ కథనాన్ని ప్రచురించింది. డాన్ వెబ్ ఎడిషన్ లో ఇండియా రిజల్ట్స్ అనే లైవ్ అప్ డేట్స్ కాలమ్ ను నడిపారు. ఇండియాలో మోడీ క్లీన్ స్వీప్ చేయబోతున్నారంటూ ‘ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్’ అనే మరో పాకిస్తానీ పత్రిక తన వెబ్ ఎడిషన్ లో ఆర్టికల్ రాసింది.

ఈ విజయం ఇండియాలో హిందూ గ్రూపులను మరింత బలపరుస్తుందని, మైనార్టీలుగా ఉన్న ముస్లింలు డేంజర్ లో పడతారంటూ పెడార్థాలు తీసింది. పాకిస్థానీ నేషనల్ టీవీ చానెల్ ‘జియో’ టీవీ మాత్రం ఇండియా ఎలక్షన్స్ రిజల్ట్స్ ను సింపుల్ గా ప్రచురించింది. ఉదయాన్నే వచ్చిన ట్రెండ్స్ ను మాత్రమే అనాలసిస్ చేసి వదిలేసింది. పాకిస్థాన్ లోని అన్ని వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు మన ఎన్నికల ఫలితాలపై వార్తలు రాశాయి.