ఎండలకు తట్టుకోలేక బీచ్ లకు పరుగులు పెడుతున్నజనం

ఎండలకు తట్టుకోలేక  బీచ్ లకు పరుగులు పెడుతున్నజనం

ఇంగ్లాండ్ లో ఎండలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్ పోర్టులో రన్ వే కరిగిపోయింది. దాంతో ఎయిర్ పోర్టు మూసేయాల్సి వచ్చింది. కేంబ్రిడ్జిలో 38 డిగ్రీలు, లండన్ లో 37.5 డిగ్రీలు నమోదయ్యాయి.  లండన్ లోని వాక్స్ హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వంగిపోవడంతో.. రాకపోకలకు అంతరాయం జరిగింది. ఇలాంటి ఘటనలతో పలుచోట్ల రైళ్లు రద్దు చేయాల్సి వస్తోంది. లండన్ లోని వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో.. కేసు విచారణను వాయిదా వేశారు.

యూకేలో పరిస్థితులు సహారా ఎడారిని తలపిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రజలు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. అడవుల్లోకార్చిచ్చు రగులుతోంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎండల ధాటికి తట్టుకోలేక ప్రజలు బీచ్ లకు పరుగులు తీస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ లో సేద తీరుతున్నారు. రాబోయే రోజుల్లో టెంపరేచర్లు పెరిగే ప్రమాదం ఉందని  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.