ఏ క్షణమైనా నీరవ్ అరెస్ట్

ఏ క్షణమైనా నీరవ్ అరెస్ట్

నీరవ్​ మోడీపై ఎట్టకేలకు అరెస్ట్​ వారెంట్​ జారీ అయింది . లండన్​లోని వెస్ట్​మి నిస్టర్​ కోర్టు వారెంట్​ జారీ చేసిందని, అతి త్వరలోనే నీరవ్​ను పోలీసులు అరెస్టు చేస్తారని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ​(ఈడీ) సోమవారం వెల్లడించింది. కొద్ది రోజుల్లో నీరవ్​ బెయిల్​పై విచారణ జరుగుతుందని,అది ముగిసిన వెంటనే అతణ్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు లైన్​ క్లియరవుతుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల కు ముంచి లండన్​ పారిపోయిన నీరవ్​ను తిరిగి అప్పగించాలంటూ బ్రిటన్​ సర్కారును ఈడీ అభ్యర్థిం చడం, దాన్ని యూకే హోం సెక్రటరీ సాజిద్​ జావెద్.. కోర్టుకు రిఫర్​ చేయడంతో పట్టివేత ప్రక్రియ ముందుకుసాగింది. ఇండియాలో నేరాలకు పాల్పడ్డ నీరవ్​, లండన్​లో లగ్జరీ లైఫ్​ గడుపుతున్నట్లు, వజ్రాల వ్యాపారం కొనసాగిస్తు న్నట్లు ఇటీవలే ఓ బ్రిటన్​ పత్రిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. నీరవ్​ అప్పగించేలా బ్రిటన్​తో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ ప్రకటించి న కొన్నాళ్లకే నిం దితుడిపై అరెస్ట్​ వారెంట్​ జారీకావడం గమనార్హం . ఇక విజయ్​ మాల్యా కేసు విచారణ కూడా తుది దశకు చేరిందని, అతని బెయిల్​ పిటిషన్​ను వెస్ట్​మి నిస్టర్​ కోర్టు కొట్టేసిన మరుక్షణం అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.