
ఒకే మిషన్ లో ఎక్కువకాలం అంతరిక్షంలో ఉన్న ఫిమేల్ ఆస్ట్రోనాట్ గా నాసా ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. శనివారం నాటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 289 రోజులను పూర్తి చేసుకొని పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న రికార్డును (288 రోజులు) కోచ్ బ్రేక్ చేశారు. మార్చి14న అంతరిక్షానికి వెళ్లిన కోచ్.. 2020 ఫిబ్రవరి 6న భూమిపైకి తిరిగి రానున్నారు. అక్టోబర్ లో నాసా ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ తో కలిసి స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా.. ఫస్ట్ ఆల్ ఉమెన్ స్పేస్ వాక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.