
ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు… సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు మంచిగా ఉన్నాయని ప్రశంసించింది. ఇప్పటికే భారత్‌లో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రధాని మోడీ ప్రభుత్వం 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 20 కోట్ల మందికి డబ్బులు బదిలి చేస్తున్నారని, ప్రపంచ దేశాలకు భారత్‌ను ఉదాహరణగా చూపెట్టింది. సామాజిక సంక్షేమం కోసం , ఆహరంతో పాటు ఇతర నిత్యావసరాలను అందించటం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరానని WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనమ్ తెలిపారు.