వినాయకుడి నిమజ్జనంలో చేయకూడని తప్పులు ఇవే...

వినాయకుడి నిమజ్జనంలో చేయకూడని  తప్పులు ఇవే...

హిందూమతంలో గణేశ్ చతుర్ధి నాడు గణేశుని ప్రతిష్ఠించి..తొమ్మిది  రోజులు ఘనంగా పూజలు చేసిన  తరువాత నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశుని నిమజ్జనం చేస్తారు. దాంతోపాటు ఇంట్లో ఆనందం, సుఖ శాంతులు వర్ధిల్లాలని ప్రార్ధిస్తారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..అయితే వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్న సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో... అలాగే నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు..

వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను ఏకదంతా అని, వినాయకుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినీ ముందుగా పూజిస్తారు. గణపయ్య జన్మదినన్నీ పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి సంవత్సరం పది రోజులపాటు జరుపుకుంటారు. ఆ తర్వాత ఆట పాటలతో, తాళమేళాలతో ఆయనను సాగనంపుతారు.. ముఖ్యంగా చెప్పాలంటే గణపయ్య నిమజ్జనానికి ముందుగా దేవుడినీ ఇష్టంగా పూజించాలి. 

  • గణపయ్య  నిమజ్జనానికి ముందు భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేయాలి.  ఎర్రని పూలు, ఎర్రచందనం, దుర్వ, శెనగ పిండి, తమలపాకు, ధూప దీపం, పాన్ మొదలైన వాటిని వినాయకుడికి సమర్పించాలి.  ఈ సామగ్రిని కూడా గణపతితో పాటే నిమజ్జనం చేయాలి. కానీ కొబ్బరికాయను పగలగొట్టకూడదు.  ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వినాయకుడికి హారతినివ్వాలి. అలాగే చతుర్దశి రోజున వినాయకుడు తన ఇంటికి తిరిగి వస్తాడని ప్రజలు నమ్ముతారు.అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు.
     
  • గణపయ్య  చేతిలో లడ్డును కూడా ఉంచాలి..గణపయ్య నిమజ్జనం సమయంలో పరిశుభ్ర పై శ్రద్ధ ఉంచాలి. నిమజ్జనం సమయంలో మీ మనసులో చెడు ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. 
     
  •  గణపతి నిమజ్జనం చేస్తున్నప్పుడు గణేశ్ విగ్రహాన్ని పొరపాటున కూడా ఒక్క ఉదుటున నిమజ్జనం చేయకూడదని గుర్తుంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగానే విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.
     
  •  ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తుంటే..విగ్రహం కంటే పెద్దదైన ఓ పాత్రను తీసుకోవాలి. ఇందులో విగ్రహాన్ని నెమ్మది నెమ్మదిగా ముంచాలి. ఆ నీళ్లను బయట పాడేయకూడదు. ఏదైనా మొక్క లేదా చెట్టు మొదళ్లో వేయాలి. ఆ నీళ్లు కిందకు అంటే నేలపై రాకుండా చూసుకోవాలి. చేతులు కూడా శుభ్రంగా ఉండాలి.
     
  •  గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయాలి.  ఇకపోతే పొరపాటున కూడా నల్ల రంగు బట్టలు ధరించకూడదు.  నలుపు శనికి సంకేతం.
     
  • ముఖ్యంగా నిమజ్జనం రోజున మాంసం జోలికి కానీ, మద్యం జోలికి కానీ అసలు వెళ్ళకూడదు. ఇవన్నీ తప్పక గుర్తుంచుకోవాలి.