ఫ్రాడ్ జరిగిన వెంటనే 155260 నెంబర్‌‌‌‌కి కాల్ చేయాలి

ఫ్రాడ్ జరిగిన వెంటనే 155260 నెంబర్‌‌‌‌కి కాల్ చేయాలి

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్ ప్రకారం ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్స్‌‌‌‌కు బ్యాంకులు బాధ్యత వహించాల్సిందే

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: డిజిటల్‌‌‌‌  ట్రాన్సాక్షన్ల వలన ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌‌‌ బెడద కూడా తప్పడం లేదు. దేశంలో ఆన్‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్లు విపరితీంగా పెరిగాయి. తోపుడు బండ్లలో అమ్మకాలు జరుపుకునే వారు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లను అంగీకరిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత మొదలైన డిజిటల్ ట్రాన్సాక్షన్ల విప్లవం  కరోనా టైమ్‌‌‌‌లో  పీక్ లెవెల్‌‌‌‌కు చేరుకుంది.    రూపాయికి రెండు వైపులు ఎలా ఉంటాయో అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్ల వలన కేవలం ప్రయోజనాలే కాదు ఇబ్బందులు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగాయి. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రిపోర్ట్ ప్రకారం, దేశంలోని బ్యాంకులు ఈ ఏడాది రూ.70 వేల కోట్ల విలువైన ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్స్‌‌‌‌కు గురయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎక్కువ.  ముఖ్యంగా క్రెడిట్‌‌‌‌ కార్డు, డెబిట్ కార్డ్‌‌‌‌, ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. చాలా మంది ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌‌‌లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ యూజర్లు తమ డబ్బులు కోల్పోయినా, వేగంగా రెస్పాండ్ అయితే కొన్ని సందర్భాల్లో రీఫండ్‌‌ పొందగలిగే వీలుంటుంది.   యూజర్‌‌‌‌‌‌‌‌ స్వయంగా  తప్పుడు వ్యక్తులకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో డబ్బులు పంపితే మాత్రం అవి ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్స్‌‌‌‌ కిందకు రావు. ఇది సైబర్ క్రైమ్‌‌‌‌ అవ్వొచ్చేమో కానీ డబ్బులు రీఫండ్ అవ్వడం కష్టం. ఎందుకంటే యూజర్‌‌‌‌‌‌‌‌ తనకు తానుగా ట్రాన్సాక్షన్ చేశాడు కాబట్టి.  

ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్‌‌‌‌కు గురైతే ఇవి చేయండి..

ఆన్‌‌‌‌లైన్ ఫ్రాడ్స్‌‌‌‌ను తగ్గించడానికి  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వివిధ చర్యలు తీసుకుంటోంది. కనీసం  ఫ్రాడ్​కు గురయిన విషయాన్ని బాధితులకు తెలియజేస్తోంది. యూజర్ల అకౌంట్‌‌‌‌ల నుంచి అమౌంట్ క్రెడిట్ అయినా లేదా డెబిట్ అయినా  అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వెంటనే మెసేజ్‌‌‌‌లు పంపుతున్నాయి. యూపీఐ, నెట్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌, ఏటీఎం విత్‌‌‌‌డ్రాయల్‌‌‌‌, కార్డు స్వాపింగ్‌‌‌‌ మొదలైన అన్ని రకాల ట్రాన్సాక్షన్ల వివరాలను జరిగిన వెంటనే కస్టమర్లకు తెలియజేస్తున్నాయి.  ట్రాన్సాక్షన్‌‌‌‌ మీరు చేయకపోతే  ‘ఈ లింక్‌‌‌‌’ను క్లిక్ చేయండి అంటూ మెసేజ్ పంపుతున్నాయి.  ట్రాన్సాక్షన్ మీరు చేయకపోయినా లేదా ఫ్రాడ్ అని తెలిసినా ఈ విషయం గురించి బ్యాంకులకు తెలియజేయడానికి  ఇదొక్కటే మార్గం. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్ ప్రకారం,  మీరు అంగీకరించకుండా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు జరిగితే మీకు వచ్చే నష్టం పరిమితంగా ఉంటుంది.  బ్యాంకుకు వెంటనే తెలియజేస్తే కొన్ని సార్లు నష్టం జీరో కూడా అవ్వొచ్చు. ఫ్రాడ్ జరిగిన మూడు రోజుల్లోపు (సాధారణంగా)  సంబంధిత బ్యాంక్‌‌‌‌కు తెలియజేస్తే, కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్‌‌‌‌కు గురికాలేదని నిరూపించే బాధ్యత  బ్యాంకులపై పడుతుంది. కస్టమర్ ఫ్రాడ్‌‌‌‌కు గురయ్యాడని తెలిస్తే బ్యాంకులు బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి  ఫ్రాడ్‌‌‌‌కు గురికాలేదని బ్యాంకులు నిరూపించాలి. గతంలో  బాధితుడు తాను ఫ్రాడ్‌‌‌‌కు గురయ్యానని నిరూపించుకోవాల్సి వచ్చేది.   ఫ్రాడ్ జరిగిందని  రుజువైతే  బ్యాంకులు ఫ్రాడ్ అమౌంట్ మొత్తాన్ని కస్టమర్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా కస్టమర్ ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ చేస్తే,  చెల్లించిన బ్యాంక్‌‌‌‌, తీసుకున్న బ్యాంక్‌‌‌‌, పేమెంట్ గేట్‌‌‌‌వేల ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్‌‌‌‌ ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ విధానంలో జరగాలి.

‘సైబర్ క్రైమ్‌‌‌‌’కు కాంటాక్ట్‌‌‌‌ అవ్వాలి..

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్ ప్రకారం, ఫ్రాడ్ జరిగిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు సంబంధిత బ్యాంకుకు తెలియజేస్తే మొత్తం ట్రాన్సాక్షన్ అమౌంట్‌‌‌‌ లేదా గరిష్టంగా బాధ్యత వహించాల్సిన అమౌంట్ (ఏది తక్కువైతే అది) ను బ్యాంకులు కస్టమర్‌‌‌‌‌‌‌‌కు చెల్లించాలి. అదే ఏడు రోజుల తర్వాత రిపోర్ట్ చేస్తే బ్యాంకుల పాలసీ బట్టి రీఫండ్ వస్తుందా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఫ్రాడ్‌‌కు గురయ్యామని  తెలియగానే వెంటనే సంబంధిత బ్యాంకులకు తెలియజేయాలి.  కస్టమర్‌‌‌‌‌‌‌‌ 155260  హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు కాల్‌‌‌‌ చేసి ఫ్రాడ్‌‌‌‌ గురించి తెలియజేయొచ్చు. హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కలిసి ఈ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ను స్టార్ట్ చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, పేటీఎం, ఫోన్‌‌‌‌పే, మొబిక్విక్‌‌‌‌, అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఆన్‌‌‌‌లైన్ వాలెట్లు ఇందులో భాగం పంచుకున్నాయి. ఫ్రాడ్​కు గురయితే ముందు  ఈ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఒక టికెట్ ఇష్యూ అవుతుంది. దీన్ని సంబంధిత బ్యాంకుకు పంపుతారు. కస్టమర్‌‌‌‌‌‌‌‌ తమ ట్రాన్సాక్షన్ డిటైల్స్‌‌‌‌ను, కొన్ని పర్సనల్ డిటైల్స్‌‌‌‌ను ఆపరేటర్‌‌‌‌‌‌‌‌తో పంచుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఇష్యూ అయ్యాక కస్టమర్‌‌‌‌‌‌‌‌కు  ఫిర్యాదుని గుర్తించినట్టు అక్నాలడ్జ్‌‌‌‌మెంట్‌‌‌‌ మెసేజ్ వస్తుంది. ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ను 24 గంటల్లోపు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అయిన  https://cybercrime.gov.in  లో సబ్మిట్‌‌‌‌  చేయాల్సి ఉంటుంది.   మనీ రీఫండ్‌‌ అవ్వడానికి కనీసం 10 రోజలు పడుతుంది.