వింటే ప్రేమ కనిపిస్తది..ఎలా అంటారా?

వింటే ప్రేమ కనిపిస్తది..ఎలా అంటారా?

ప్రేమ.. ప్రేమ అంటరు కానీ, ప్రేమని చూపించున్రి అంటే మాత్రం.. ‘ఏది ఎక్కడ?’ ‘ఎట్ల చూపిస్తం ?’అనేటో ళ్లే ఎక్కువ! ప్రేమను కళ్లకు చూపించడం కష్టమేమో కానీ, మనం మాట్లా డుతున్నప్పుడు…శ్రద్ధగా వింటు న్న పార్ట్‌‌‌‌నర్ కళ్లలోకి చూడున్రి, ప్రేమ ఎట్ల ఉంటదో తెలుస్తది! అవును.. వినే వాళ్ల కళ్లల్లో ప్రేమ కనపడ్తది.అది ముచ్చట చెప్తున్నోళ్లకు వినపడ్తది.ఎట్లంటరా? ఇది అనుభవించినోళ్లకు అర్థమయ్యే కథ! అనుభవించాలి అనుకుంటున్నోళ్లకు ఇది అర్థం చేసుకోవాల్సిన కథ!!

 

పార్ట్‌ నర్‌‌‌‌ అటెన్షన్‌ ‌కొందరు ఎప్పుడూ తమ పార్ట్‌ నర్ చెప్పేది వినేవాళ్లే అయినా.. కొన్ని సార్లు చిరాకు పడతారు. దీనికి టైమింగే కారణం. ఏ టైం లో మనం వాళ్ల దగ్గరకి ఏ విషయం తీకెళ్తున్నా మనే దాంతో పాటు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యం . దీనికి తోడు చెప్పేది వినడానికి ప్రియమైన వాళ్లు ఎప్పుడూ రెడీగా ఉంటారని నమ్ముతుంటాం . అయితే ఎంతటి ప్రేమైనా సరే.. అటెన్షన్ అనేది అన్ని సార్లు, అన్ని వేళలా ఉండదు. ఏదైనా షేర్‌‌‌‌ చేసుకోవాలనుకున్నప్పుడు… అవతలి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని కూడ పరిగణలోకి తీసుకోరు. వాళ్లేం చేస్తున్నా రు?వాళ్లేం ఆలోచిస్తున్నా రు? అనే విషయాలేం పట్టించుకోకుండా వెళ్లి మాట్లాడుతుంటారు కొందరు. జీవితం పంచుకున్నారు కాబట్టి…వాళ్లు మన బాధల్ని వినాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ, అన్ని వేళలా వినడానికిరెడీగా ఉన్నారని ఎక్స్‌ పెక్ట్ చేయడం వల్లే సమస్య వస్తుంది.

ఎందుకంటే…

మనం ఎలాం టి పరిస్థితుల్లో ఉన్నామో…అలాం టి పరిస్థితుల్లో నే.. పార్ట్‌ నర్ ఉంటారనుకోవద్దు. షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం.. కాబట్టి పార్ట్‌ నర్‌‌‌‌ కూడా రెడీగా ఉండి తీరాల్సిం దే అనుకునేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. అలాకాకుండా అవతలి వాళ్లని అడిగి..షేర్ చేసుకోవడం మొదలుపెడితే వాళ్లు ఫుల్‌ అటెన్షన్ మన మీద పెట్టే అవకాశం ఉంది. ‘ఇప్పుడు కాదు.. తర్వాత చెప్పు..’ అంటే కూడా హర్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది.

ఇది గుర్తుం చుకుంటే..

ఎక్స్​పీరియెన్స్​లు షేర్ చేసుకుంటున్నప్పుడు.. ఇద్దరి మధ్య గౌరవం దెబ్బతినకుండా చూసుకోవాలి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది.. ‘పార్ట్‌ నర్ అయినంత మాత్రాన అవతలి వ్యక్తి పూర్తిగా మన సొంతం కాదు. అలాగే, మనం కూడా పార్ట్‌ నర్‌‌‌‌కి సొంతం కాదు.’ ఎందుకంటే ఎవరికి వాళ్లు వారి వారి ప్రపంచాల్లో ఉంటారు. షేర్ చేసుకోవడానికి పార్ట్‌ నర్‌‌‌‌ని పర్మిషన్‌ అడగటం ఏంటి? అనిపిం చొచ్చు.కానీ, మనం చెప్పేది ఎదుటివాళ్లు ఫుల్ అటెన్షన్‌ తో వినాలంటే వాళ్లకు వీలున్న టైంలో ప్లాన్ చేసుకోవడమే బెటర్‌‌‌‌.

హెల్దీ రిలేషన్‌‌షిప్‌

మనం ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు..పార్ట్‌ నర్ వినితీరాల్సిందే అనుకోవడం హెల్దీ పార్ట్‌ నర్‌‌‌‌షిప్‌ కి సంకేతం కాదు. ఒకరిగురిం చి మరొకరు పూర్తిగా తెలుసుకోవడం, ఒకరి ప్రయారిటీకి మరొకరు అవకాశం, స్పేస్ ఇచ్చుకోవడం, ఒకరికోసం మరొకరుటైం కేటాయించుకోవడం హెల్దీ రిలేషన్‌ షిప్‌ !పార్ట్‌ నర్ టైంకి, స్పేస్‌‌కి, అవసరానికి రెస్పెక్ట్ఇవ్వాలి. ఇది మన బాధ్యత.నమ్మి నా.. నమ్మకపోయినా.. సెల్ఫ్‌ కేర్ తర్వాతే పార్ట్‌ నర్ కేర్ అనేది రియాలిటీ!కాబట్టి, ముందు మనం మంచిగుంటేనే పార్ట్ నర్ ను మంచిగ చూసుకుంటం.

ఇదే గొప్ప గిఫ్ట్‌

ఏదైనా విషయం షేర్ చేసుకోవడానికి ముందు.. వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం అని చూసి, అడగాలి. ఇలా అడిగి మాట్లాడటం అనేది ఇద్దరికీ మంచిది. ఎవరైనా ఏదైనా చెప్తుంటే.. శ్రద్ధగా వినడమే వాళ్లకు మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్‌ . మన దగ్గర ఉండే విలువైన ఆస్తి కూడా శ్రద్ధగా వినడమే!వింటున్నాం .. అంటే వందశాతం ప్రేమిస్తున్న సంగతి ఎదుటివాళ్లకు అర్థమవుతుంది. వినగలవా? టైముందా? అనే చిన్న రిక్వెస్ట్ ఇద్దరి మధ్య మరింత అన్యోన్యతను పెంచుతుంది.