కొడుకు ప్రేమిస్తే.. తండ్రిని చంపేశారు

V6 Velugu Posted on Jun 09, 2020

పెళ్లి చేసుకుంటామని ఇంట్లోంచి వెళ్లిపోయిన జంట
పరువు పోయిందని అమ్మాయి అన్నదమ్ముల ఆగ్రహం

చౌటుప్పల్​, వెలుగు: తమ చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె అన్నదమ్ములు, బంధువులు అబ్బాయి తండ్రిని దారుణంగా హత్య చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం జనగాం శివారులో ఈ నెల 5న జరిగిన హత్యను పోలీసులు చేధించారు. చౌటుప్పల్​ పోలీస్​ స్టేషన్​లో డీసీపీ కె.నారాయణరెడ్డి సోమవారం కేసు వివరాలను  వెల్లడించారు. జనగాంకు చెందిన గడ్డం గాలయ్య కూతురు నవనీత, గందిగొల్ల గాలయ్య కొడుకు బాబు ప్రేమించుకుంటున్నారు. గాలయ్య తన కూతురికి ఇటీవల మరొకరితో  నిశ్చితార్థం చేశాడు. ఫిబ్రవరిలోనే పెళ్లి జరగాల్సిఉండగా, తాను బాబును ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె బాబుతో కలిసి వెళ్లిపోయింది. దీంతో తమ పరువు పోయిందని బాబు మీద, అతని తండ్రి గాలయ్య మీద నవనీత తండ్రి, అన్నదమ్ములు  గడ్డం సురేశ్, రమేశ్, వెంకటేశ్‌‌‌‌ కక్ష పెంచుకున్నారు. పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువులైన దాసరి లవ్లేశ్,  గడ్డం స్వామి, రాజులతో కలిసి హత్యకు కుట్ర చేశారు. గాలయ్య  ఈ నెల 5న మోటార్​ సైకిల్​పై సంస్థాన్​ నారాయణపురానికి వెళ్లాడు. అతన్ని వెంబడించిన నిందితులు జనగాం గ్రామ శివారులో మాటు వేశారు. గాలయ్య తిరిగివస్తుండగా అడ్డకుని కత్తితో దాడి చేసి, హత్య చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు సురేశ్​ను, అతని బంధువులను పట్టుకుని విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. నిందితులను  అరెస్టు చేసి నల్లగొండ కోర్టులో హాజరుపర్చారు.

For More News..

లాక్‌డౌన్‌తో .. రేట్ల మోత

ఓపెన్ అయినా జనం పెద్దగా రాలే!

Tagged murder, Love affair, Choutuppal, son love.. father murder

Latest Videos

Subscribe Now

More News