పేలిన సిలిండర్లు : రోడ్డుపై చెలరేగిన మంటలు

పేలిన సిలిండర్లు : రోడ్డుపై చెలరేగిన మంటలు

గుజరాత్ లోని సూరత్ లో ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళుతున్న టెంప్ లో మంటలు వచ్చాయి. మంటల ధాటికి సిలిండర్లు పేలిపోయాయి. సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్కూల్ ఉండటంతో అధికారులు పిల్లలను అక్కడి నుంచి తరలించారు.

రోడ్డుపైనే టెంపో తగలబడంతో … ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. మంటలకు సిలిండర్లు పేలుతుండటంతో ఇతర వాహనదారులు దూరంగానే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది ఘటానాస్థలికి వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు.