మళ్లీ తెరపైకి ఎల్ఆర్ఎస్...ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు సర్కార్ కసరత్తు

మళ్లీ తెరపైకి ఎల్ఆర్ఎస్...ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు సర్కార్ కసరత్తు
  • మళ్లీ తెరపైకి ఎల్ఆర్ఎస్
  • సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌‌లో ఉండగానే
  • ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు సర్కార్ కసరత్తు
  • 2020 నాటి అప్లికేషన్లు పరిశీలించాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు
  • లీగల్​గా దొరకకుండా ఇంటి పర్మిషన్​ ముసుగులో క్లియర్​ చేసే యోచన
  • రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో 25.59 లక్షల దరఖాస్తులు
  • రూ. 20 వేల కోట్లు రాబట్టుకోవడమే టార్గెట్ గా ప్లాన్​

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్​ఎస్​) మరోసారి తెరపైకి వచ్చింది. ఓపెన్ ప్లాట్లు, అనధికార లేఔట్ల రెగ్యులరైజేషన్ విషయంలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం.. ఖజానాను నింపుకునేందుకు మళ్లీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ -–2020లో భాగంగా వచ్చిన అప్లికేషన్లను పరిశీలించాలని, నిర్ణీత చార్జీలు చెల్లించినవారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను మౌఖికంగా ఆదేశించింది.

దీంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, చైర్​పర్సన్లు, కమిషనర్లు.. స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, లైసెన్స్ డ్ సర్వేయర్లతో సమావేశాలు నిర్వహిస్తూ ఎల్ ఆర్ఎస్ ప్రక్రియను స్పీడప్ చేస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 25,59,562 అప్లికేషన్లు పెండిగ్ లో ఉండగా.. వీటి ద్వారా సుమారు రూ. 20 వేల కోట్లు రాబట్టాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. 

చార్జీలకు ఏ విధానం?

నాన్​ లేఔట్లలో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లను నామమాత్రపు చార్జీలతో రెగ్యులరైజ్ చేయాలని చాలా ఏండ్లుగా  ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అయితే రెగ్యులరైజేషన్ చార్జీల లెక్కింపు కోసం భూముల మార్కెట్  వ్యాల్యూను ప్రాతిపదికగా తీసుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా 2021 జులైలో భూముల మార్కెట్  వ్యాల్యూను ప్రభుత్వం పెంచింది. 2022  ఫిబ్రవరిలో మరోసారి పెంచింది. ఇట్లా రెండుసార్లు పెంచడంతో గతంతో పోలిస్తే మార్కెట్ వ్యాల్యూ దాదాపు డబుల్  అయింది. మార్కెట్  వ్యాల్యూను బట్టే ఎల్ఆర్ఎస్ చార్జీల నిర్ణయించడం వల్ల... ప్రభుత్వం కొత్త చార్జీలను (కొత్త మార్కెట్​ వ్యాల్యూ ప్రకారం) వసూలు చేస్తుందా.. లేక పాత చార్జీలకే (పాత మార్కెట్​ వ్యాల్యూ ప్రకారం) పరిమితమవుతుందా అనే విషయంలో క్లారిటీ లేదు. దరఖాస్తులు చేసుకునే నాటికి పాత మార్కెట్ వ్యాల్యూ అమలులో ఉన్నందున అదే వ్యాల్యూను వర్తింపజేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. 

రెగ్యులరైజేషన్​తోపాటు ఇంటి పర్మిషన్

ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు కేవలం ఇంటి పర్మిషన్ కోసమే ఫీజు చెల్లించాలి. కానీ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకున్నవారు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవానుకుంటే ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూలో 14 శాతాన్ని ఓపెన్ స్పేస్ చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిగాక అప్లికేషన్  ఫీజు రూ. 10 వేలు, ఇతర ఫీజులన్నీ కలిపితే రూ. 40 వేల వరకు అవుతున్నది. అందుకే ఇప్పుడు ల్యాండ్ రెగ్యులరైజేషన్​తోపాటు ఇంటి పర్మిషన్  కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. లీగల్ గా చిక్కకుండా, దొరకకుండా ఉండేందుకు ఇంటి పర్మిషన్​ ముసుగులో ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లను క్లియర్ చేయాలనుకుంటున్నది. 

ప్లాట్​ను పరిశీలించాకే చార్జీల నిర్ధారణ

ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను రూపొందించి 2020లో జీవో నెం. 131ను మున్సిపల్‌‌‌‌శాఖ విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం,  అప్లికేషన్​లో పేర్కొన్న ప్లాట్.. బఫర్‌‌‌‌జోన్‌‌‌‌, గ్రీన్‌‌‌‌జోన్‌‌‌‌, కమర్షియల్‌‌‌‌ జోన్లలో లేదని టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌అధికారులు నిర్ధారించాల్సి ఉంటుంది. వారే సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా చార్జీలను లెక్కగట్టి చెప్పనున్నారు.

కోర్టు ఏం చెప్పిందంటే..

ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 131, 152ను సవాల్ చేస్తూ హైకోర్టులో 2020లోనే పిల్ దాఖలు కాగా.. ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. దీంతో హైకోర్టు విచారణను నిలిపివేసి సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని 2021 జనవరిలో సూచించింది. అంతేగాక సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ప్రజలతో బలవంతంగా చార్జీలు కట్టించుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పక్కనబెట్టిన ప్రభుత్వం.. మళ్లీ తాజాగా దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక అధికారికంగా ఎలాంటి జీవోగానీ, మెమోగానీ, సర్క్యులర్ గానీ లేకుండానే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన  ప్రక్రియ చేపట్టడం అనుమానాలకు తావిస్తున్నది.

పెండింగ్​లో 25.59 లక్షల అప్లికేషన్లు.. 

రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 25,59,562 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,06,891 అప్లికేషన్లు రాగా, గ్రేటర్ వరంగల్ పరిధిలో 1,01,033 అప్లికేషన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51,395 దరఖాస్తులు అందాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26,641 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా గ్రామ పంచాయతీల నుంచి 10,83,394, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.255.95 కోట్ల రాబడి సమకూరింది. ప్రభుత్వం మొత్తంగా 10 లక్షల వరకు అప్లికేషన్లు  వస్తాయని అనుకుంటే.. అంచనాకు మించి వచ్చాయి. ప్రభుత్వం ముందు రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని  అంచనా వేసుకున్నప్పటికీ.. అది రూ.20 వేల కోట్లకు చేరింది. 

ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలి

పేద, మధ్యతరగతి ప్రజలే తక్కువ ధరకు వచ్చే నాన్ లేఔట్ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటిని తప్పనిసరిగా రెగ్యులరైజ్ చేసుకోవాలని, లేదంటే ఇంటి నిర్మాణ పర్మిషన్ ఇవ్వమని చెప్పడమంటే వారిపై ఆర్థికభారం మోపడమే. ఒక్కో ప్లాట్​కు సగటున రూ.లక్ష నుంచి 2 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఎల్ఆర్​ ఎస్​ను రద్దు చేసి నామమాత్రపు ఫీజుతో రెగ్యులరైజ్ చేయాలి. 

- నారగోని ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

ప్రాసెస్ మాత్రమే చేస్తున్నం

ఎల్ఆర్ఎస్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ప్రొసిడింగ్స్ ఇస్తం. ఈలోపు ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తున్నం. పాత మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులపై భారం తగ్గనుంది. ఎల్ఆర్ఎస్ ఆదాయంలో పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లదు. మున్సిపల్ కార్పొరేషన్​ అభివృద్ధికే వాడుతం. 

- యాదగిరి సునీల్ రావు, మేయర్, కరీంనగర్ కార్పొరేషన్