
హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( ఎల్ఆర్ఎస్ )స్కీమ్ కు స్పందన కరువైంది. రాష్ర్ట వ్యాప్తంగా ఫీజు చెల్లించాలని లేఖలు పంపినా ఫీజులు చెల్లించటం లేదని డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్) అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారు.
డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి 20 లక్షల 43 వేల మందికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపించారు. ఇందులో 5,96,928 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించగా పెద్ద ఎత్తున ఫీజు చెల్లించారు. ఈ ఏడాది జూన్ 30న రాయితీ గడువు ముగిసింది.
ఆ సమయంలో నిత్యం వెయ్యి మందికి పైగా ఫీజులు చెల్లించగా.. ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా రోజుకు 50 మందిలోపే ఫీజు చెల్లిస్తున్నారని డీటీసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు.