తెలుగు ఆడియెన్స్ నన్ను బాగా ఆదరిస్తున్నారు : దుల్కర్ సల్మాన్

తెలుగు ఆడియెన్స్ నన్ను బాగా ఆదరిస్తున్నారు : దుల్కర్ సల్మాన్

తెలుగు ప్రేక్షకులు తనను  ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పాడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా వెంకీ అట్లూరి రూపొందించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అభినందనలు తెలియజేశారు.  ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ నన్ను బాగా ఆదరిస్తున్నారు.

మహానటి, సీతారామం తర్వాత ఇప్పుడు లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ఇందులో  భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పాడు.  తాను పోషించిన సుమతి పాత్రకు మంచి ఆదరణ దక్కుతుందని చెప్పింది మీనాక్షి చౌదరి. వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.

ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది.  అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని చెప్పాడు. నిర్మాత నాగవంశీ,  నటులు సాయి కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.