కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ దెబ్బకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్-19నుంచి తమను తాము రక్షించుకోవటానికి సామాజిక దూరం పాటిస్తున్నారు. షేక్ హ్యాండ్ కు బదులు భారతీయ పద్ధతి ప్రకారం నమస్కారం చేస్తున్నారు. అగ్ర రాజ్యాధినేతలు కూడా ఇదే అనుసరిస్తున్నారు. గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్
ప్యారిస్ లోని ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ట్రావెల్ ఆంక్షలపై చర్చించేందుకు ఈ ఐరోపా దేశాల అగ్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి నమస్తేతో ఏంజెలా మెర్కల్‌కు మాక్రన్ స్వాగతం పలకగా ఆమె కూడా నమస్తే చెబుతూ ఆయనకు ప్రతినమస్కారం చేశారు. ఈ వీడియోని మ్యాక్రాన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV
— Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020
