అంచనాలను మించిన లోధ లాభం

అంచనాలను మించిన లోధ లాభం

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌ (లోధ) ఎనలిస్టుల అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో రూ. 505 కోట్లకు  పెరిగింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.405 కోట్లతో పోలిస్తే 25 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.370 కోట్లు ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. మాక్రోటెక్‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ (కార్యకలాపాలు) 65 శాతం పెరిగి రూ. 1,774 కోట్ల నుంచి రూ.2,930 కోట్లకు ఎగసింది.  రూ.2,459 కోట్ల రెవెన్యూ వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు.

క్యూ3 లో కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు, వడ్డీల కంటే ముందు లాభం)  రూ.882 కోట్లకు పెరిగింది. రూ.625 కోట్లు వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ప్రీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి క్యూ3 లో రూ.3,410 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ పేర్కొంది. క్యూ3లో  మూడు కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను కంపెనీ లాంచ్ చేసింది.  ‘వీటి ఏరియా 20 లక్షల చదరపు అడగులు. ఈ మూడు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల గ్రాస్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వాల్యూ రూ.60 వేల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో రూ. 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0,300 కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి పెట్టుకున్న టార్గెట్ రూ.17,500 కోట్లను దాటేశాం’  అని ఎండీ అభిషేక్‌‌‌‌‌‌‌‌ లోధ​అన్నారు.