మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడి

మహబూబ్ నగర్ జిల్లాలో   ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడి

మహబూబ్ నగర్, వెలుగు: ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మదాసి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ మదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్  చేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు కల్పించడం కేవలం మదాసి కురువల హక్కులను కాలరాయడేమనని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు  మొండి వైఖరిని విడనాడి వెంటనే ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. అనంతరం అడిషనల్  కలెక్టర్ కు వినతిపత్రం  అందజేశారు.