పిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్

పిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ నుంచి పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్నారులకు టీకాలు ఇవ్వడంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాలకు బదులు ముక్కులో ఇచ్చే నాసల్ వ్యాక్సిన్ ను వాడాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. పిల్లలను కాపాడుకునే క్రమంలో మేడిన్ ఇండియా నాసల్ వ్యాక్సిన్ లు గేమ్ చేంజర్ లుగా మారతాయని భావిస్తున్నట్లు సౌమ్య తెలిపారు. ఈ టీకా ఇవ్వడం వల్ల శ్వాస మార్గంలో ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు. అప్పట్లోగా పెద్దలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా టీచర్లకు వ్యాక్సినేషన్ చేయాలని, తద్వారా కమ్యూనిటీ వ్యాప్తి తక్కువ కాగానే స్కూళ్లను తిరిగి ప్రారంభించొచ్చని సూచించారు.