- అమ్మవార్లను దర్శించుకోనున్న 4 రాష్ట్రాల భక్తులు
కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామలో కొలువైన మధున పోచమ్మ జాతర ఈ నెల 9 న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మరిశెట్టి తిరుపతి తెలిపారు.
8న రథోత్సవం, 9న జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు.
