మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల, వెలుగు: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం డెవలప్​ అవుతుందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్  ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళా సంఘాల మాదిరిగానే, కిశోర బాలికలు, 60 ఏండ్లు పైబడిన వారి కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసి, ఆదుకునే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

అనంతరం ఎస్సీ కాలనీ, పోల్కంపల్లిలో కమ్యూనిటీ హాల్  బిల్డింగ్ లకు, మూసాపేట మండలం నందిపేటలో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. జానంపేటలో కబ్రస్తాన్  కాంపౌండ్  వాల్  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


వనపర్తి: మహిళలకు ఇందిర మహిళా శక్తి చీరలు పంచుతుంటే సొంత ఇంటి ఆడపడుచులకు కుంకుమ సారే ఇచ్చినంత ఆనందంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్త కోట మండలం పాలెంలోని  రైతు వేదికలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

మహిళా సంఘాల్లో లేని 8,500 మంది ఆడపడుచులను సంఘాల్లో చేర్పించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. పదేండ్లుగా మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని, ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏంఎసీ చైర్మన్  ప్రశాంత్, మహిళా సమాఖ్య చైర్మన్  చెన్నమ్మ, యామిని, తహసీల్దార్ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.