గబ్బర్ సింగ్ గాలితీసేసిన ఉన్నతాధికారులు

గబ్బర్ సింగ్ గాలితీసేసిన ఉన్నతాధికారులు

ఆయనో పోలీస్ అధికారి. ఒంటిమీద ఖాకీ డ్రెస్ ఉండే సరికి తాను షోలో సినిమాలో అంజద్ ఖాన్ లా ఫీలై పోయాడు. యూనిఫామ్ లో డైలాగ్స్ చెబితే క్లాప్స్ పడతాయని ఊహించాడు. కానీ  అధికారులు క్లాప్స్ కొట్టాల్సింది పోయి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంతకీ ఆ పోలీస్ అధికారి ఏం చేశారని అనుకుంటున్నారా..?

మధ్యప్రదేశ్‌లోని జాబువా జిల్లాలోని కళ్యాణపుర పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గా కేఎల్ దంగీ వ్యవహరిస్తున్నారు. అయితే విధుల్లో భాగంగా కేఎల్ దంగీ పోలీస్ జీప్ లో పెట్రోలింగ్ నిర్వహించారు. పెట్రోలింగ్ సందర్భంగా మైక్ తో షోలే పంచ్ డైలాగ్స్ పేల్చారు.

నా కొడుకు నిద్రపోతున్నాడు. గబ్బర్ సింగ్ ను నేనే వచ్చా. కల్యాణ్ పురాకు 50కిలోమీటర్ల దూరంలో ఎవరైనా పిల్లలు ఏడుస్తుంటే మీ పిల్లలకు చెప్పండి దంగీ వస్తాడని” అంటూ పలికిన డైలాగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలపై ఉన్నతాధికారి ఆనంద్ సింగ్ స్పందించారు. దంగీపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.