సెక్స్ స్కాండల్.. 92 వీడియో క్లిప్పుల్లో ఉన్నదెవరు?

సెక్స్ స్కాండల్.. 92 వీడియో క్లిప్పుల్లో ఉన్నదెవరు?
  • మాజీ మంత్రులు, ఐఏఎస్​లు, ఐపీఎస్ లున్నట్లు భావిస్తున్న సిట్
  • మధ్యప్రదేశ్ సెక్స్ స్కాం డల్కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
  • స్పెషల్ సాఫ్ట్​వేర్ ద్వారా సెక్స్చాట్స్, ఫోన్ కాల్స్ రికార్డింగ్
  • లోక్ సభ ఎన్ని కల సమయంలో వీడియోలు అమ్మిన శ్వేత జైన్

భోపాల్ముందుగా హై ప్రొఫైల్ నేతలను ‘టార్గెట్’ చేయడం.. హనీ ట్రాప్ ద్వారా వారిని ముగ్గులోకి దించడం.. ‘యాక్షన్’లో ఉన్నప్పుడు వీడియోలు రికార్డు చేయడం.. వాటిని చూపించి డబ్బులు డిమాండ్ చేయడం.. మధ్యప్రదేశ్​ సెక్స్ స్కాండల్ సాగిన తీరు ఇది. హనీ ట్రాప్ సిండికేట్​లో సూత్రధారి, కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతా జైన్.. ఓ టీవీ జర్నలిస్టు ద్వారా నేతలను బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బు డిమాండ్ చేయడం వంటివి చేసిందని దర్యాప్తులో తేలింది. బెంగళూరుకు చెందిన కంపెనీ సహాయంతో సెక్స్ చాట్స్, ఫోన్ కాల్స్ రికార్డు చేసినట్లు వెల్లడైంది. మంగళవారం ఐదుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

వేలాది వీడియోలు..

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ సంజయ్ షామి నేతృత్వంలోని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లకు సంబంధించి 92 వీడియో క్లిప్పులను ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ ఫుటేజీల్లో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సిట్ వర్గాలు తెలిపాయి. ‘‘3 ల్యాప్​టాప్స్, 12 ఫోన్లలో వేలాది వీడియో క్లిప్పులు, సెక్స్ చాట్స్, ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. అరెస్టు చేసిన ఐదుగురు  నుంచి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాం. ప్రస్తుతం వీఐపీలు ఉన్నట్లుగా భావిస్తున్న కొన్ని వీడియోలను సిట్ పరిశీలిస్తోంది” అని వివరించాయి. ఈ సెక్స్ స్కాండల్​లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, పొలిటీషియన్లను గుర్తించేందుకు పలు బృందాలను సంజీవ్ షామి ఏర్పాటు చేశారని చెప్పాయి. మరోవైపు సెక్స్ స్కాండల్​కు చెందిన రెండు వీడియోలు కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, మరో యువనేత ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.

టీవీ జర్నలిస్టు ద్వారా బ్లాక్​మెయిల్!

హనీ ట్రాప్ సిండికేట్ తరఫున ఢిల్లీకి చెందిన ఓ హిందీ టీవీ జర్నలిస్టు పని చేశాడన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. శ్వేతా జైన్ తరఫున ఆ జర్నలిస్టు వెళ్లి బ్లాక్ మెయిల్ చేసే వాడని సమాచారం. వీడియోలు చూపించి డబ్బులు డిమాండ్ చేసే వాడని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రిపోర్టర్ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అని, సెంట్రల్ గవర్న్​మెంట్ అక్రెడిటేషన్ కూడా అతడికి ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకిరావడంలో ముఖ్యపాత్ర పోషించిన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ హర్బజన్ సింగ్​ను కూడా.. ఆ జర్నలిస్టు డబ్బు డిమాండ్ చేశాడని తెలిపింది. దీంతో హర్బజన్ సింగ్.. హనీ ట్రాప్ సిండికేట్​పై కేసు పెట్టారని, మొత్తం వ్యవహారం బట్టబయలైందని వివరించింది.

30 కోట్లకు వీడియోలు అమ్మే ప్రయత్నం

గత లోక్​సభ ఎన్నికల సమయంలో సీనియర్ పొలిటీషియన్లకు చెందిన వీడియో ఫుటేజీలను రూ.30 కోట్లకు అమ్మేందుకు శ్వేతా జైన్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. బేరం కుదరక పలుమార్లు చర్చలు కూడా జరిగినట్లు తెలిసింది. ‘‘రాష్ర్టంలో ప్రభుత్వం మారడంతో పార్టీలతో తాము పెంచుకున్న ‘లింకులు’ కట్టయ్యాయని హనీ ట్రాప్ సిండికేట్ భావించింది. దీంతో వీలైనంత త్వరగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో లోక్​సభ ఎన్నికలు కలిసి వస్తాయని అనుకుంది. ఓ పొలిటీషియన్ ఓ వీడియోను 6 కోట్లకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నాడు. కానీ శ్వేత 30 కోట్లకు రూపాయి కూడా తగ్గనని కూర్చుంది. కానీ పరిస్థితి మారింది. తర్వాత డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ఎంతోకొంతకు కొన్ని వీడియోలను అమ్ముకుంది” అని సిట్ వర్గాలు చెప్పాయి.

లిప్స్టిక్లో కెమెరాలు

వీఐపీల వద్దకు వెళ్లే అమ్మాయిలు లిప్​స్టిక్, గాగుల్స్​లో స్పై కెమెరాలను దాచే వారని, అక్కడ జరిగే దాన్ని రికార్డు చేసే వారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రముఖ నేతల ఫోన్‌‌‌‌లను ట్యాప్‌‌‌‌ చేయడంలో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ పని చేసినట్టు సిట్ గుర్తించింది. హనీట్రాప్‌‌‌‌ సూత్రధారి శ్వేతా జైన్‌‌‌‌, బెంగళూరుకు చెందిన ఓ  కంపెనీ సాఫ్ట్ వేర్ ద్వారా సెక్స్ చాట్స్, ఫోన్ కాల్స్ రికార్డు చేసినట్లు వెల్లడైంది.