మాదిగలకు సముచిత గౌరవం ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

మాదిగలకు సముచిత గౌరవం ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
  • గజ్జెల కాంతం, పిడమర్తి, వరప్రసాద్‌‌‌‌‌‌‌‌తో భేటీలో సీఎం రేవంత్ హామీ

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వంలో మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, ఊట్ల వరప్రసాద్​తో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో రేవంత్​ చర్చించారు. అనంతరం గజ్జెల, పిడమర్తి, ఊట్ల మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డితోనే మాదిగలకు పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘రాజ్యసభ, శాసనమండలితోపాటు నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణకు అనుకూలంగా బిల్లు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు” అని పేర్కొన్నారు. పార్లమెంట్ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీని నిలువరించడం కోసం మాదిగలను ఏకం చేస్తామని చెప్పారు.