
లాస్ ఏంజెలిస్: తన బాడీలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని తెలిసి అమెరికా పాప్ సింగర్ మడొన్నా ఎగిరి గంతేస్తోంది. ఆ వైరస్ తనకు సోకదంటూ సంబరపడిపోతోంది. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన తాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రేపే కారులో లాంగ్ డ్రైవ్‌కి వెళతానంటోంది. ఈ న్యూస్‌ని ఆమే స్వయంగా తన క్వారంటైన్ డైరీ 14వ ఎడిషన్‌లో షేర్ చేసుకుంది. ‘కరోనా యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్న తెల్లారే పాజిటివ్ అని వచ్చింది. రెండు వారాలుగా హోం క్వారంటైన్ పాటిస్తున్నా. మధ్యలో ఒక్క రోజు కూడా కిటికీ తలుపులు తెరవలేదు. పొద్దు వంక చూడలేదు. నా ఒంట్లో కరోనా యాంటీబాడీలు ఉన్నాయి కాబట్టి నేనింకా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకే రేపే బయటికి పోతున్నా. చానాళ్ల దాకా రాను. విండో డోర్లు ఓపెన్ చేస్తా. వెలుగును చూస్తా. సూర్యుడు ఎప్పట్లాగే షైన్ అవుతున్నాడనే నమ్ముతున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కరోనా సోకిన వ్యక్తులను గుర్తించటానికి అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) యాంటీబాడీ టెస్టులు చేస్తోంది.