శ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం దంపతులు..

శ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ సీఎం దంపతులు..

శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దంపతులు.శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ నుండి సుండిపెంట చేరుకొని, అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైలం చేరుకున్నారు మోహన్ యాదవ్.ఆలయానికి చేరుకున్న మధ్యప్రదేశ్ సీఎంకు స్వాగతం పలికారు అర్చకులు, ఆలయ అధికారులు. అనంతరం స్వామివారిని దర్శించుకొని, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మోహన్ యాదవ్ దంపతులు.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మోహన్ యాదవ్ దంపతులకు అర్చకులు, వేద పండితులు వేదం ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు,శేషవస్త్రాలు,శ్రీస్వామి,అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు.దర్శనం తర్వాత రోడ్డు మార్గంలో సుండిపెంట నుండి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాదుకు వెళ్లారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.