
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం, లాజిస్టిక్ రంగాల కోసం ఐటీ సొల్యూషన్స్ & హ్యూమన్ క్యాపిటల్, ఈ–సర్వెలెన్స్ డ్రోన్‌ల తయారీ సంస్థ మాగెల్లానిక్ క్లౌడ్ డ్రోన్లను లాంచ్ చేసింది. ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్‌లు మనిషి సాయం లేకుండా పనిచేయగలవు. కంపెనీ డ్రోన్ ఉత్పత్తులలో లాజిస్టిక్స్ డ్రోన్‌లు, అగ్రి స్ప్రేయింగ్ డ్రోన్‌లు, కస్టమ్ డ్రోన్‌లు ఉన్నాయి. లాజిస్టిక్స్ డ్రోన్‌లు 5 కి.మీ నుండి 60 కి.మీ వరకు వెళ్తాయి. రెండు నుండి 100 కిలోల మధ్య కార్గో పేలోడ్‌లను మోస్తాయి. ధరలు రూ.3.5 లక్షల నుంచి మొదలవుతాయి.
ఈ సందర్భంగా మాగెల్లానిక్ క్లౌడ్ సీఈఓ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ డ్రోన్లు మరో రెండు నెలల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో డ్రోన్ మార్కెట్ సైజు రూ.50 వేల కోట్ల వరకు ఉంటుంది. 100 కిలోల బరువును మోసే డ్రోన్లను కూడా మేం తయారు చేస్తున్నాం. మాకు బెంగళూరులో తయారీ కేంద్రం, ఆర్ అండ్ డీ సెంటర్ ఉన్నాయి. ఈ డ్రోన్లన్నింటినీ దాదాపు లోకల్‌గానే తయారు చేశాం. క్యూ4లో కార్యకలాపాల మాకు రూ.387.50 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.74.10 కోట్ల నికరలాభం
వచ్చింది” అని ఆయన వివరించారు.