
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. కలెక్టరేట్ లో మంగళవారం లోకల్ బాడీ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. డీపీవో పార్థసారథి, మాస్టర్ ట్రైనర్ బాలు యాదవ్ పాల్గొన్నారు.
నిర్వాసితులకు సౌలతులు కల్పించాలి..
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావవాస కాలనీలో సౌలతులు కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టరేట్ లో ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో రివ్యూ చేశారు. వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్ట తండా, శామగడ్డ తండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కింద సౌలతులు కల్పించాలన్నారు.
300 గజాల స్థలం, పీహెచ్సీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామపంచాయతీ బిల్డింగ్, పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, మిషన్ భగీరథ పైప్లైన్ వంటి సౌలతులు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు