గండీడ్ లో అడిషనల్ కలెక్టర్ తనిఖీలు

గండీడ్ లో అడిషనల్ కలెక్టర్ తనిఖీలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు :  గండీడ్ మండల కేంద్రంలో ఆదివారం కేజీబీవీ, రైస్ మిల్లులు, లైసెన్డ్ సర్వేయర్ల ఎగ్జామ్ సెంటర్లను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. కేజీబీవీ ఆవరణలో వర్షపునీరు నిల్వ ఉండి అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. 

మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..? అని స్టూడెంట్స్ ను అడి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని రైస్ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ డెలివరీ త్వరగా క్లంప్లీట్ చేయాలని మిల్లుల యాజమాన్యులకు సూచించారు. ప్రభుత్వ బాయ్స్ కాలేజీలో లైనెన్స్ సర్వేయర్లకు జరుగుతున్న రాత పరీక్ష సెంటర్ ను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏడీ కిషన్ రావు, హౌసింగ్ పీడీ భాస్కర్ ఉన్నారు.