మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మొదటి విడత ఎలక్షన్లు జరిగే గ్రామాల్లో ఓటర్ స్లిప్పులు పక్కాగా పంపిణీ చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. ఆదివారం పలు మండలాల్లో పర్యటించిన ఆయన ధర్మాపూర్ గ్రామంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులు అందించడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కల్పించాలని బూత్ లెవల్ ఆఫీసర్లకు సూచించారు.
తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఓటర్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని బాలసదనం, శిశుగృహను సందర్శించారు. బాలసదనంలో చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌలతులపై ఆరా తీశారు. శిశుగృహలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.
