యువత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

యువత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్  అర్బన్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నగరంలోని శిల్పారామంలో నిర్మాణ్  ఓఆర్జీ, ఇన్ఫోసిస్  ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో స్కిల్స్​ డెవలప్​ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.

 టాస్క్, అమరరాజా,సెట్విన్  సంస్థల్లో స్కిల్  డెవలప్​మెంట్  సెంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. మహబూబ్ నగర్  ఫస్ట్  ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలకు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించినట్లు తెలిపారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, గుండా మనోహర్, చర్ల శ్రీనివాసులు, శ్రీనివాస్  పాల్గొన్నారు. అనంతరం మహేశ్వరం గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ సీట్​ దక్కించుకొని ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న మాచన్ పల్లి తండాకు చెందిన కె.రాజేశ్వరికి ఎమ్మెల్యే రూ.25 వేల ఆర్థికసాయం అందించారు.