మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం : రూ.417 కోట్ల డబ్బు, బంగారం సీజ్.. ఎంత దోచుకున్నారయ్యా..

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం : రూ.417 కోట్ల డబ్బు, బంగారం సీజ్.. ఎంత దోచుకున్నారయ్యా..

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్ మహదేవ్ బుక్ మనీలాండరింగ్ కేసుకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోల్‌కతా, భోపాల్, ముంబైలలో సోదాలు నిర్వహించి రూ. 417 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర నగరాల్లో మహదేవ్ యాప్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లపై ఈడీ ఇటీవల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌లు మహాదేవ్ ఆన్‌లైన్ బుక్‌కు ప్రధాన ప్రమోటర్లు. వీరు దుబాయ్ నుంచి తమ కార్యకలాపాలను నడుపుతున్నారని దర్యాప్తులో తేలిందని ఏజెన్సీ తెలిపింది. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యూఏఈలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుంచి నడుస్తుందని, 70 - 30 శాతం లాభ నిష్పత్తిలో వారి సహచరులకు ప్యానెల్ లేదా బ్రాంచ్‌లతో ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా నిర్వహించబడుతుందని తెలిపింది.

Also Read :- శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో .. 621 గ్రాముల బంగారం స్వాధీనం

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్ మహదేవ్ బుక్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మను కూడా ఈడీ  ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విశాఖపట్నం పోలీసులు, ఇతర రాష్ట్రాలు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ అనేది అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే ఓ సిండికేట్ లాంటిది.