ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొరంచపల్లిలో మహాధర్నా

ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొరంచపల్లిలో మహాధర్నా

భూపాలపల్లి రూరల్, వెలుగు : వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో మహాధర్నా నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ రాస్తారోకోతో మెయిన్ ​రోడ్డుకు  రెండు వైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి నచ్చజెప్పినా ధర్మసమాజ్‌‌ పార్టీ నాయకులు వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

 ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాల్సిందేనని, లేకపోతే ఆందోళన ఆపేదిలేదని హెచ్చరించారు. దీంతో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ దివాకర్‌‌ మోరంచపల్లికి చేరుకొని బాధితులకు న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్, వరంగల్‌‌ ఉమ్మడి జిల్లా ఇన్‌‌చార్జి మేకల సుమన్, జిల్లా ప్రచార కమిటీ నాయకులు కండె రవి, మంద రమేశ్‌‌, రాజ్‌‌కుమార్‌‌, దొమ్మాటి రవీందర్, సతీశ్‌‌ పాల్గొన్నారు.