మహారాష్ట్రలో బంద్.. హైవేలు బ్లాక్

మహారాష్ట్రలో బంద్.. హైవేలు బ్లాక్

ముంబై: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనను నిరసిస్తూ మహారాష్ట్రలో అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి (మహా వికాస్ అఘాడీ) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది. మహారాష్ట్రలోని చాలా జిల్లాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసేసి ఉన్నాయి. స్థానికంగా బస్సు సర్వీసులు కూడా నడవడం లేదు. కానీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో లోకల్ రైళ్లు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే బంద్‌లో భాగంగా శివసేన పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ పూణె, బెంగళూరు హైవేను బ్లాక్ చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ బంద్‌లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడం కలకలం రేపింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ముంబైలో దాదాపు 8 బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. దీంతో పోలీసు భద్రతతో పరిమితంగా బస్సు సర్వీసులను నడుపుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ప్రాంతీయ వాదం గెలిచింది.. ‘మా’ కు ప్రకాశ్‌ రాజ్ రాజీనామా

ఎలిమినేటర్ పోరులో గెలిచేదెవరో? 

షారుఖ్ కొడుకు కేసు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా