
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులు తన తల్లి, భార్యతో కలిసి నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలుపంచుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.