
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఆరే వేర్ బీచ్‌లో శనివారం (జూలై 19) ఘోర విషాదం చోటుచేసుకుంది. బీచ్‌కు విహారయాత్రకు వచ్చిన నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా ఎగిసిన అలల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
మృతులు ఉజ్మా షేక్ (18), ఉమేరా షేక్ (29), జైనాబ్ ఖాజీ (26), జునైద్ ఖాజీ (30) గా గుర్తించారు. వీరంతా థానే-ముంబ్రాకు చెందినవారు.
స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనంతరం శనివారం సాయంత్రం మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు, స్థానిక అధికారులు వర్షాకాలంలో సముద్రం అత్యంత ప్రమాదకరమని, బీచ్‌ల వద్ద సందర్శకులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.