రాసిపెట్టి ఉంటే.. : చద్దామని దూకాడు.. బతికిపోయి అరెస్టు అయ్యాడు...

రాసిపెట్టి ఉంటే.. : చద్దామని దూకాడు.. బతికిపోయి అరెస్టు అయ్యాడు...

ఏం కష్టం వచ్చిందో ఏమో.. జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడో వ్యక్తి. కానీ అతడికి ఇంకా భూమ్మీద నూకలున్నట్లున్నాయ్‌.. ఆరో అంతస్తు నుంచి దూకినా.. అతడికి ఏమీ కాలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో జరిగింది. . మహారాష్ట్ర హెడ్‌ ఆఫీసు మంత్రాలయ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. కానీ.. రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన, వలలో పడటంతో ప్రాణాలు నిలిచాయి.చనిపోవాలనుకున్నా.. బతికేయటంతో ఆ వ్యక్తి పెద్దపెద్దగా అరచి గోల చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. అతడిని సేఫ్టీ నెట్‌ నుంచి బయటకు తీసుకువచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆరో ఫ్లోర్ చేరుకుని, అక్కడి నుంచి కిందికి దూకాడు. అయితే, కింద రక్షణగా బలమైన నెట్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పై నుంచి దూకిన వ్యక్తి నెట్‌లో పడటం వల్ల అతడికి ఏమీ కాలేదు. సురక్షితంగా ఉన్నాడు. వెంటనే అక్కడున్న వ్యక్తులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వాళ్లు నెట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించి, బయటకు తీశారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అనుకున్నాడో చెప్పాడు. 

వివరాల ప్రకారం.. 

మంత్రాలయంలో ప్రాజెక్టు  డ్యాంలను నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించింది.  అయితే ఆ భూమికి పరిహారం పెంచాలని.. ప్రాజెక్ట్ బాధిత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి.  ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంభిస్తుందని బాధితులు వాపోయారు.  తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఓ వ్యక్తి మంత్రాలయభవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు.  అయితే గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలే జరగడం వలన ప్రభుత్వం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.  దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

గతంలో కూడా. . . 

2018లో ఫిబ్రవరిలో ఓ నలుగురు వ్యక్తులు మంత్రాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ రక్షణ వల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనా భవనం చుట్టూ మధ్య దాదాపు పదివేల చదరపు అడుగుల ఖాళీ ప్రాంతంపై ఆనాటి ప్రభుత్వం రక్షణ వలను ఏర్పాటు చేసింది. ఆ నిర్ణయమే  మనోడి ప్రాణాలను ఇప్పుడు కాపాడింది. గతంలో ప్రజలు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలిపేందుకు 11 మంది మహారాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులోని భద్రతా వలయంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పుడు  నిరసనకారులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.