సరిహద్దు వివాదంపై రేపు NCP నిరసన ర్యాలీ

సరిహద్దు వివాదంపై రేపు NCP నిరసన ర్యాలీ

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం మరింత ముదిరింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర ఎన్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ చేపడతామని ఆ పార్టీ నేత అజిత్ పవార్ అన్నారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఎన్సీపీతో మిగతా పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పారు. 

మహారాష్ట్ర..కర్ణాటక సరిహద్దు సమస్యపై బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై NCP నేత అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర చిహ్నాలను బీజేపీ నేతలు అవమానించడంపై మండిపడ్డారు. బార్డర్ లో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీకి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదన్నారు. నిరసన ర్యాలీ అజెండాపై భావసారుప్యత కలిగిన పార్టీలన్నీ ఏకీభవించాయని..ప్రజలుపెద్ద సంఖ్యలో తరలిరావాలని సూచించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడానికి హరీశ్ సాల్వేను నియమించాలని ప్రభుత్వానికి అభ్యర్థన చేశామని ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ తెలిపారు.