శంభాజీ నగర్​లో టెన్షన్ టెన్షన్..పోలీస్ వెహికల్స్​కు నిప్పు

శంభాజీ నగర్​లో టెన్షన్ టెన్షన్..పోలీస్ వెహికల్స్​కు నిప్పు

 

  •     రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ   
  •     పోలీస్ వెహికల్స్​కు నిప్పు.. భారీగా బలగాల మోహరింపు

ముంబై/కోల్ కతా:   మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్​(ఔరంగాబాద్) పట్టణంలో బుధవారం సాయంత్రం రెండు వర్గాలకు చెందిన వందలాది మంది యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు గ్రూపుల వాళ్లు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులపైనా అటాక్ చేశారు. ఆరు పోలీస్ వెహకల్స్​కు నిప్పుపెట్టారు. శ్రీరామనవమి, రంజాన్ పర్వదినాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లోనే ఉందని పోలీసులు గురువారం వెల్లడించారు. పట్టణంలో ప్రఖ్యాత రామమదిరం ఉన్న కిరాద్ పురా ఏరియాలో ఈ ఘటన జరిగిందని, గొడవల్లో ఐదారు వందల మంది పాల్గొన్నారని  స్థానిక పోలీస్ కమిషనర్ నిఖిల్ గుప్తా చెప్పారు. మొదటగా రెండు వర్గాలకు చెందిన కొందరు యువకుల మధ్య గొడవ మొదలైందని, ఆ తర్వాత ఇరువైపులా వందలాది మంది గుమిగూడి ఘర్షణకు దిగారని తెలిపారు. హింసకు పాల్పడినవారిని గుర్తించి, అరెస్ట్ చేసేందుకు 10 టీంలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో శాంతి నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్, బీజేపీ నేత, మంత్రి అతుల్ సవే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని సీఎం ఏక్ నాథ్ షిండే పిలుపునిచ్చారు.

హౌరాలో కత్తులు, కర్రలతో ర్యాలీ  

బెంగాల్​లోని హౌరాలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సంఘానికి చెందిన యువకులు కత్తులు, హాకీ స్టిక్స్, త్రిశూలాలు పట్టుకుని ఎగురుతూ ర్యాలీలో పాల్గొన్నారు.